Plasma: ప్లాస్మా దానం చేయండి.. తారల పిలుపు
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Plasma: ప్లాస్మా దానం చేయండి.. తారల పిలుపు

హైదరాబాద్‌: ‘ప్లాస్మా దానం చేయండి. దీని వల్ల కరోనా నుంచి మరికొందరు త్వరగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు’ అని కోరారు సినీ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారాయన. ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో బాధితులు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా ప్లాస్మా కొరత వల్ల చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కోలుకున్నట్లయితే మీ ప్లాస్మాని దానం చేయండి. దీని వల్ల మరో నలుగురు కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడినవారవుతారు. ప్రత్యేకంగా నా అభిమానులూ ఈ కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై సూచనలు, వివరాల కోసం చిరంజీవి ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ కార్యాలయాన్ని (040-23554849, 94400 55777) సంప్రదించవచ్చన్నారు.

వెంకటేశ్‌, నాగార్జున సైతం అభిమానులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు సంబంధిత వెబ్‌సెట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని