దాసరికి తగిన గుర్తింపు ఇప్పటికీ రాలేదు: చిరు
close

తాజా వార్తలు

Published : 04/05/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాసరికి తగిన గుర్తింపు ఇప్పటికీ రాలేదు: చిరు

హైదరాబాద్‌: ‘దాసరి నారాయణరావుకి ప్రభుత్వ నుంచి సముచిత గుర్తింపు ఇప్పటికీ రాలేదు’ అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. మంగళవారం (మే 4) దాసరి జయంతి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా దాసరి సేవల్ని కొనియాడారు. ‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి నా స్మృత్యాంజలి. ఒకదానికి మించి మరొక చిత్రాన్ని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా మలిచారు. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే! దాసరికి ప్రభుత్వ గుర్తింపు ఇప్పటికీ రాకపోవడం తీరని లోటు.  ఇప్పటికైనా దాసరికి పద్మ పురస్కారం అందితే అది తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది’ అని పేర్కొన్నారు.

నివాళి..

మూవీ అర్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌, నిర్మాతలు సి. కల్యాణ్‌, తుమ్మల పల్లి సత్యనారాయణ, కొరియోగ్రాఫర్‌ సత్య తదితరులు  ఫిల్మ్ ఛాంబర్‌లోని దాసరి విగ్రహానికి నివాళులు అర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని