దీపిక పదుకొణెకు కరోనా.. కుటుంబ సభ్యులకూ..
close

తాజా వార్తలు

Published : 05/05/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక పదుకొణెకు కరోనా.. కుటుంబ సభ్యులకూ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌పై కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. తాజాగా బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె కరోనాకు గురైంది. కొంతకాలం క్రితం ఆమె తండ్రి ప్రకాశ్‌ పడుకొణె అనారోగ్యానికి గురవడంతో ఆయనను బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పరీక్షలు చేయగా.. తనకు, తన భార్యకు, చిన్న కూతురు అనీషా కూడా కరోనాకు గురైనట్లు తేలింది. మరోవైపు మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించడంతో దీపిక తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి బెంగళూరుకు వచ్చింది. తాజాగా దీపిక చేయించుకున్న కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. దీనికి సంబంధించి ఆమె ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇలా తన కుటుంబం మొత్తం కరోనాకు గురైంది. ఆమె కుటుంబ సభ్యులంతా కోలుకుంటున్నారని తెలుస్తోంది.

దీపిక తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి స్పోర్ట్స్‌ డ్రామా ‘83’లో నటించింది. అది విడుదల కావాల్సి ఉంది. అందులో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్‌.. అతని భార్య రోమి పాత్రలో దీపిక కనిపించనుంది. దీంతో పాటు పఠాన్‌, ఫైటర్‌, ది ఇంటెర్న్‌ చిత్రాల్లోనూ దీపిక నటించాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని