close

తాజా వార్తలు

Published : 22/01/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమె ప్రభుత్వాన్ని కదిలించింది!

యుక్తవయసులో.. తోటి బాలికలు నెలసరి సమయంలో అవసరమయ్యే న్యాప్కిన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆమె గుర్తించింది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. దాంతో బ్రిటిష్‌ ప్రభుత్వం దిగొచ్చి పేద బాలికలకు శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ విజయాన్ని సాధించిన అమ్మాయి 20 ఏళ్ల అమికాజార్జ్‌.. మన భారతీయ మూలాలు ఉన్న అమ్మాయే కావడం విశేషం. బ్రిటన్‌లో... నిరుపేద బాలికలు నెలసరి సమయంలో వార్తాపత్రికలు, టాయ్‌లెట్‌ రోల్‌, సాక్సులని వాడటం గమనించిన అమికా చాలా బాధపడింది. తనవంతుగా పాఠశాలలు, మురికివాడల్లో అమ్మాయిలకు న్యాప్కిన్లు, నెలసరికి వినియోగించే కప్స్‌ పంపిణీ చేసేది. ఆ సాయం సరిపోదనిపించింది. పైగా న్యాప్కిన్లు లేక బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతోంది. దాంతో ప్రభుత్వ సాయం అందితే తప్ప దీనికి పరిష్కారం దొరకదని భావించింది. కోర్టులో కేసు దాఖలు చేసింది. పోరాటమూ మొదలుపెట్టింది. అమికా ప్రచార ప్రభావం, న్యాయస్థానం ద్వారా ఆమె చేసిన పోరాటానికి ఇంగ్లండ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రాథ]మిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఉచిత న్యాప్కిన్లను ప్రభుత్వం అందించనుంది. అమికా జార్జ్‌ చేసిన సేవకుగాను ‘గోల్‌ కీపర్స్‌ గ్లోబల్‌ గోల్స్‌’ అవార్డు అందుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని