close

తాజా వార్తలు

Published : 29/01/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటర్‌తో కోస్టుగార్డు నావిక్‌ కొలువు

సముద్ర తీర ప్రాంతాల్లోని ఆయిల్‌ నిల్వలు, మత్స్య సంపద, ఖనిజాల వంటి వాటికి నిరంతరం కాపలాకాస్తూ.. సముద్ర చట్టాలను పరిరక్షిస్తూ... స్మగ్లింగ్‌ కార్యకలాపాలను నిరోధించే బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇండియన్‌ కోస్ట్‌గార్ఢ్‌ ఇందులో చేరడానికి ఇంటర్మీడియట్‌ సరిపోతుంది. ప్రస్తుతం ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

భారతీయ తీరగస్తీ దళం (ఇండియన్‌ కోస్టుగార్డు) నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌ అర్హతతో వీటికి పోటీ పడవచ్ఛు రాత, శరీరదార్డ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనంతోపాటు, పలు ప్రోత్సాహాలు లభిస్తాయి.

మొత్తం పోస్టులు: 260. వీటిలో జనరల్‌ అభ్యర్థులకు 113, ఓబీసీ 75, ఈడబ్ల్యూఎస్‌ 26, ఎస్సీ 33, ఎస్టీ 13 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ / +2 ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది. పురుషులు మాత్రమే అర్హులు.

వయసు: కనిష్ఠం 18 ఏళ్లు, గరిష్ఠం 22 సంవత్సరాలు. ఆగస్టు 1, 1998 - జులై 31, 2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.

పరీక్ష తీరు

పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బేసిక్‌ కెమిస్ట్రీలతోపాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం విభాగాల నుంచి ప్లస్‌-2 (ఇంటర్మీడియట్‌) స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ నుంచీ ప్రశ్నలు ఇస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్డ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వివరాలను పరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి, ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోలు, ఏదైనా ఐడీ, సర్టిఫికెట్ల నకళ్లను తీసుకెళ్లాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రాన్నీ సమర్పించాలి. ప్రవేశ పత్రాలు మూడు సెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిపై నీలం బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న పాస్‌ పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు అతికించాలి. వీటిని పరిశీలించిన తర్వాతే పరీక్షకు అనుమతిస్తారు.

పీఈటీ: అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి. 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

తుది ఎంపిక

రాతపరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులైన వారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను జులైలో కోస్ట్‌గార్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రాథమిక శిక్షణ ఆగస్టు నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారికి సంస్థ అవసరాలు, శిక్షణలో చూపిన ప్రతిభ ద్వారా బ్రాంచి/ ట్రేడు కేటాయిస్తారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 (లెవెల్‌-3) మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. వేతనంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ...మొదలైనవి) ఉంటాయి. వీరు భవిష్యత్తులో ప్రధానాధికారి (లెవెల్‌-8) హోదా వరకు చేరుకోవచ్ఛు.


ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 2

పరీక్ష: ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చిలో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: ఏపీ విద్యార్థులకు విశాఖపట్నం, తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్‌.

వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.inTags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని