close

తాజా వార్తలు

Updated : 19/02/2020 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చదువుకో స్మార్ట్‌గా..

వాడితేపోలా!

అన్నీ స్మార్ట్‌ అయిపోతున్నాయ్‌.. విద్యార్థుల చదువుల సంగతేంటి? వారినీ స్మార్ట్‌ ఉపకరణాలతో పరీక్షలకు సిద్ధం చేస్తే! ఇవిగో వీటిని ప్రయత్నించొచ్ఛు ఒకటి స్మార్ట్‌ లైట్‌.. ఇంకొకటి స్మార్ట్‌ పెన్‌

డిజిటల్‌ చేస్తుంది!

క్లాస్‌లో రన్నింగ్‌ నోట్స్‌.. తర్వాత హోం వర్క్‌లు.. ప్రాజెక్టు వర్క్‌లు.. ఇలా నోట్స్‌ రాస్తూనే ఉంటారు. రాసిందంతా క్షణాల్లో డిజిటల్‌గా మార్చేస్తే. ఎప్పుడంటే అప్పుడు స్మార్ట్‌ఫోన్‌ నోట్స్‌ని యాక్సెస్‌ చేస్తే! అలాంటిదే ఈ స్మార్ట్‌ పెన్ను. పేరు లైవ్‌స్రైబ్‌. ఈ పెన్‌తో మీరు పేపర్‌పై రాసిన రాతలు, చేసిన లెక్కలు, గీసిన బొమ్మలు.. ఇలా అన్నింటినీ క్షణాల్లో డిజిటల్‌ చేస్తుంది. బ్లూటూత్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్‌ చేసుకుంటే చాలు. రాసింది మొత్తం స్కాన్‌ అయ్యి ఫోన్‌లోకి సింక్‌ అవుతుంది. అంతేకాదు గూగుల్‌ డ్రైవ్‌లో భద్రంగా దాచి ఉంచుతుంది. మీకు కావాల్సినపుడు నోట్స్‌ని వెతికి వెలికి తీయొచ్ఛు ‘లైవ్‌స్రైబ్‌+’ యాప్‌ ద్వారా మీ రాతకు వాయిస్‌ కూడా జోడించొచ్ఛు టెక్స్ట్‌, పీఎన్‌జీ, పీడీఎఫ్‌ రూపంలోకి మార్చి మీ స్నేహితులకు షేర్‌ చేయొచ్చు కూడా.

సింపుల్‌గా చదివేయండి

వచ్చేదంతా పరీక్షల కాలం.. రాత్రి పగలు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. మరి, శ్రద్ధగా చదువుకునేటప్పుడు కరెంటుపోతే ఇబ్బందే.. అందుకే స్మార్ట్‌గా ఈ ఎల్‌ఈడీ ల్యాంప్‌ని ఇంట్లో పెట్టేసుకోండి. పేరు ఎంఐ రీఛార్జబుల్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌. దీనికి రీఛార్జబుల్‌ బ్యాటరీ సదుపాయం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2000ఎంఏహెచ్‌. ఒకసారి ఛార్జ్‌ చేసి సుమారు 5 రోజుల వరకూ వినియోగించుకోవచ్ఛు అంతేకాదు ఇదొక ఎమర్జెన్సీ ల్యాంప్‌ కూడా.. కరెంటు కోత సమయంలో ఒక్క బటన్‌ నొక్కితే చాలు. మూడు రకాలుగా వెలుతురు వెదజల్లుతుంది. లైట్‌ని 120డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకోవచ్చు.

ధర రూ.1499


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని