close

తాజా వార్తలు

Published : 19/02/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిహారీ మలయాళికి వందకు వంద!

మనకు తెలియని భాష చదవడానికే భయపడతాం.. ఇక పరీక్ష రాయాలంటే వణుకుపుట్టాల్సిందే...కేరళకు వలస వెళ్లిన రోమియా మాత్రం మలయాళం లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది.. ఆ విశేషాలివి.
రోమియా కతూర్‌ బిహార్‌లో పుట్టిపెరిగింది. అక్కడ సరైన ఉపాధి లేదు. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమయ్యేది. అందుకే పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం కేరళకు వలస వచ్చింది. భర్త సైఫుల్లాతో కలిసి దక్షిణ కొల్లాంలోని ఉమయనల్లూరులో 2014లో చిన్న జ్యూస్‌ పార్లర్‌ ఏర్పాటు చేసింది. అలా వచ్చే కాస్తోకూస్తో ఆదాయమే ఆ కుటుంబానికి జీవనాధారం. ఆమెకు ముగ్గురు పిల్లలు. నాలుగు నెలల క్రితం మూడో కూతురు పుట్టింది. అప్పుడే కేరళ లిటరసీ మిషన్‌ అధికారులు ఛంగతి కార్యక్రమం కింద వలస వచ్చినవారికి మలయాళంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. పాపను చూసుకుంటూ రోమియా ప్రతిరోజూ చదివేది. గత జనవరిలో పరీక్ష నిర్వహించారు. అందులో వంద మార్కులు తెచ్చుకుని తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. ఈ ప్రతిభావని గురించి తెలుసుకొని అక్కడి అధికారులు ఆమె ఇంటికి వచ్చిమరీ అభినందిస్తున్నారు. ‘ఈ శిక్షణ రైల్వే స్టేషన్లలో, మార్కెట్లు, జనసందోహం ఉన్న ప్రదేశాల్లో మలయాళం మాట్లాడటానికి ఎంతో ఉపయోగపడుతోందని చెబుతోందా’మె.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని