close

తాజా వార్తలు

Updated : 26/02/2020 22:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రిటన్‌ అటార్నీ జనరల్‌గా భారత సంతతి మహిళ

బ్రిటన్‌ అటార్నీ జనరల్‌గా భారత సంతతి మహిళ

లండన్‌: భారతీయ మూలాలున్న మహిళ స్యుయెలా బ్రావెర్మన్‌ బ్రిటన్‌లో కీలక పదవిని చేపట్టారు. ఈమెను ఇంగ్లాండ్‌, వేల్స్‌ అటార్నీ జనరల్‌గా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఫిబ్రవరి 13న ప్రకటించారు. కాగా స్యుయెల్లా ఆ పదవిని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ వద్ద సోమవారం లాంఛనంగా చేపట్టారు. ఒక మహిళ అటార్నీ జనరల్‌ పదవిని అలంకరించటం ఆ దేశ చరిత్రలో ఇది రెండవసారి. అంతేకాకుండా కేవలం 39 సంవత్సరాలకే బ్రావెర్మన్‌ ఈ ఘనతను సాధించటం మరో విశేషం.

ఈమె స్యుయెలా ఫెర్నాండెజ్‌గా భారతీయ మూలాలున్న దంపతులకు జన్మించారు. కాగా ఆమె తల్లితండ్రులు కెన్యా, మారిషస్‌లలో నివసించిన అనంతరం లండన్‌కు వలస వెళ్లారు. అక్కడి హీత్ ఫీల్డ్‌ స్కూల్‌లో పాఠశాల విద్య అనంతరం స్యుయెల్లా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2015లో ఫేర్‌హామ్‌ నుంచి తొలిసారిగా దిగువ సభకు ఎన్నికైన స్యుయెలా బ్రావెర్మన్‌... తదనంతరం 2017, 2019లలో కూడా అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా బ్రావెర్మన్‌ మాట్లాడుతూ ‘‘బ్రిటన్‌ అటార్నీ జనరల్ గా పదవీ స్వీకారం చేయటం నాకు గర్వకారణం. ఈ పదవిని అలంకరించిన రెండవ మహిళగా చరిత్ర సృష్టించే ఈ క్షణాన్ని నేను అనందిస్తున్నాను.  నా కంటే ముందు ఈ పదవిలో ఉన్న వారు చేసిన కృషికి... ప్రభుత్వానికి, ప్రజలకు వారు చేసిన సేవలకు కృతజ్ఞతలు.’’ అని అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని