
తాజా వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాలు
ఎస్టీపీఐలో టెక్నికల్ స్టాఫ్
టెక్నికల్ స్టాఫ్ మొత్తం ఖాళీలు: 15 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 05, 2020. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: మే 20, 2020.
వెబ్సైట్: https://www./stpi.in/
ఐఐఐటీఎన్ఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
నయా రాయపూర్(చత్తీస్‌గఢ్)లోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు-ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో-06, రిసెర్చ్ అసిస్టెంట్-06. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం, గేట్/ నెట్ అర్హత.
ఎంపిక విధానం: అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సంబంధిత సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2020.
వెబ్సైట్: https://iiitnr.ac.in/
డబ్ల్యూసీడీ, దిల్లీ
ఎన్సీటీ దిల్లీ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు అభివృద్ధి విభాగం(డబ్ల్యూసీడీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 187 పోస్టులు: కన్సల్టెంట్, అకౌంటెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్స్, బ్లాక్ కో-ఆర్డినేటర్, బ్లాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేది: మే 11, 2020.
వెబ్సైట్: http://www.wcddel.in/
ఎయిమ్స్, న్యూదిల్లీ
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, డైటీషియన్, ఫీల్డ్ అటెండెంట్, రిసెర్చ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్: rutf2020@gmail.com చివరి తేది: మే 05, 2020.
వెబ్సైట్: https://www.aiims.edu/