close

తాజా వార్తలు

Published : 23/04/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాఠాల బోధనలోఉన్నతంగా.. ఉత్తమంగా!

ఇంటర్‌ తర్వాత ఉపాధ్యాయ విద్య

ఆచార్య దేవోభవ అంటూ గురువుకి అత్యున్నత స్థానాన్ని అందించింది మన సంస్కృతి. అందుకే బోధన రంగానికి ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఉంటోంది. మంచి ఆదాయంతోపాటు ఉన్నతమైన ఉద్యోగ జీవితాన్ని ప్రసాదించే ఈ కెరియర్‌లోకి ప్రవేశించాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. అలాంటి వాళ్లంతా ఇంటర్మీడియట్‌ అర్హతతోనే ఆ లక్ష్యం వైపు సాగిపోవచ్ఛు డీఎడ్‌తోపాటు రకరకాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పలు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆసక్తికి అనుగుణంగా ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.

సంతృప్తి, సమాజంలో గౌరవం, ఆకర్షణీయ వేతనం ఇవన్నీ ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేకం. అందుకే చాలామంది ఆ ఉద్యోగాలవైపు చూస్తుంటారు. ఇంటర్మీడియట్‌ తర్వాత నుంచే టీచింగ్‌ దిశగా అడుగులు వేయవచ్ఛు సంబంధిత కోర్సుల్లో చేరవచ్ఛు ఇంటర్‌ అర్హతతో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డీఎడ్‌. కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీఏ లేదా బీఎస్సీలతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నేరుగా ఎమ్మెస్సీ-బీఎడ్‌ చేయవచ్చు.

డీఎడ్‌/డీఈఎల్‌ఎడ్‌

డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) లేదా డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఎడ్‌) కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ విద్యార్హతతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీ పడవచ్ఛు జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లలో ప్రైమరీ టీచర్‌ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్ఛు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు విద్యార్థులకు బోధించడానికి వీరికి అర్హత ఉంటుంది. డీఎడ్‌/డీఎల్‌ఈఎడ్‌ కోర్సును ప్రభుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (డైట్‌)లతోపాటు, ప్రైవేటు సంస్థల్లోనూ అందిస్తున్నారు. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (డీఈఈసెట్‌)లో చూపిన ప్రతిభతో ప్రవేశాలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాధ్యమాల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45) శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసినవారూ అర్హులే. సెప్టెంబరు 1, 2020 నాటికి వయసు 17 ఏళ్లు నిండాలి. తెలంగాణ డీఈఈసెట్‌ కోసం ఏప్రిల్‌ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్ఛు ఏపీలో ప్రకటన వెలువడాల్సి ఉంది.

బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌

నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తికావడం ఈ కోర్సుల ప్రత్యేకత. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాంతీయ విద్యా సంస్థలు, కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రసిద్ధ ప్రైవేటు సంస్థలు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరినవారికి ఏడాది సమయం ఆదాతోపాటు, బోధనపై గట్టి పునాది ఏర్పడుతుంది. పూర్తిచేసుకున్నవారు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు పోటీ పడవచ్ఛు పదో తరగతి వరకు బోధించడానికి వీరికి అవకాశం ఉంటుంది.

కోర్సులు, చివరి తేదీలు

రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ), మైసూరు అందిస్తున్న నాలుగేళ్ల బీఎస్సీ బీఎడ్‌ (ఎంపీసీ), బీఎస్సీ బీఎడ్‌ (బైపీసీ), బీఏబీఎడ్‌; ఆరేళ్ల ఎమ్మెస్సీఎడ్‌ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) కోర్సుల్లో ప్రవేశానికి మే 4లోగా దరఖాస్తు చేసుకోవచ్ఛు పరీక్షలు మే 24న నిర్వహిస్తారు.

ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఎడ్‌ కోర్సు జమ్మూ, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఉంది. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ (మ్యాథ్స్‌) సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ప్రవేశాలు సీయూసెట్‌తో లభిస్తాయి. ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తేజ్‌పూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సును మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తోంది. ప్రకటన వెలువడింది. ఏప్రిల్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీ, తంజావూరు బీఏ (ఇంగ్లిష్‌) బీఎడ్‌, బీఎస్సీ (మ్యాథ్స్‌) బీఎడ్‌, బీఎస్సీ (ఫిజిక్స్‌) బీఎడ్‌ కోర్సులను అందిస్తోంది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, బెంగళూరు నాలుగేళ్ల బీఎస్సీ-ఎడ్‌ కోర్సును బయలాజికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో అందిస్తోంది.

● ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, గుజరాత్‌ (గాంధీనగర్‌)లో ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎంఎడ్‌, ఎమ్మెస్సీ ఎంఎడ్‌ కోర్సులు ఉన్నాయి.

గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, తమిళనాడు (దిండిగల్‌) బీఎస్సీ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది.

జీడీ గొయంకా యూనివర్సిటీ, లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌, బీఎస్సీ బీఎడ్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు

తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ, టెట్‌ కం టీఆర్‌టీ తదితర పేర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఎంపికైన ఎస్జీటీలకు రూ.21,230, స్కూల్‌ అసిస్టెంట్‌ (టీజీటీ)లకు రూ.28,940 మూలవేతనం అందుతోంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. కొత్త పే కమిషన్‌ అమలైతే ఈ మొత్తాలు మరింత పెరుగుతాయి. జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, ఆర్మీ స్కూళ్లు... మొదలైన వాటిలో పీజీటీలకు లెవెల్‌-8 ప్రకారం రూ. 47,600 టీజీటీలకు లెవెల్‌-7 ప్రకారం రూ. 44,900 ప్రైమరీ టీచర్లకు లెవెల్‌-6 ప్రకారం రూ. 35,400 మూలవేతనం లభిస్తుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. సబ్జెక్టుపై పట్టు, ఆంగ్లంలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉన్నవారిని ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు మంచి వేతనంతో నియమించుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ టీచింగ్‌, హోమ్‌ ట్యూషన్లు బాగా పెరుగుతున్నాయి. నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలకూ ఈ సేవలు విస్తరించాయి. ఆర్‌ఐఈ, అజీం ప్రేమ్‌జీ లాంటి మేటి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాల ద్వారా అవకాశాలు లభిస్తున్నాయి.

టెట్‌, సీటెట్‌

డీఎడ్‌, బీఎడ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలో చేరాలంటే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. రాష్ట్ర స్థాయుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటేజీ ఉంటుంది. కేంద్ర స్థాయిలో సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్‌)ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాలకు సీటెట్‌ ఉపయోగపడుతుంది. టెట్‌ లేదా సీటెట్‌లో అర్హత సాధించినవారు రాష్ట్రం లేదా కేంద్ర స్థాయిలో ప్రకటనలు వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌

ఇంటర్‌ తర్వాత నేరుగా ఎమ్మెస్సీతోపాటు బీఎడ్‌ చదువుకునే అవకాశం ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-ఎడ్‌తో లభిస్తుంది. ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఈ విధానంలో సబ్జెక్టుపై పట్టుతోపాటు ఏడాది సమయం ఆదా అవుతుంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆర్‌ఐఈ మైసూరులో ఈ కోర్సు అందుబాటులో ఉంది. వీటిని పూర్తిచేసినవారు ఎస్జీటీ, ఎస్‌ఏ, జేఎల్‌ పోస్టులకు పోటీ పడవచ్ఛు నెట్‌లో అర్హత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్ఛు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాసమితి, ఆర్మీ స్కూల్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులకు వీరు ప్రయత్నించవచ్చు.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని