
తాజా వార్తలు
ఇంటర్‌తో కేంద్ర కొలువు
ఇంటర్మీడియట్ విద్యార్హతలో కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నుంచి స్టెనోగ్రాఫర్ ప్రకటన వెలువడింది. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్టుల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
కేంద్ర కొలువులపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డిలో తమకు ఇష్టమైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రెండు పోస్టులకూ కలిపి పోటీ పడవచ్చు. విభాగాల వారీ ఖాళీల వివరాలను తర్వాత ప్రకటిస్తారు.
Tags :