close

తాజా వార్తలు

Published : 02/01/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుకున్నది సాధించాలంటే...

నా వయసు 20 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నా. కొత్త ఏడాదిలో ఏం చేయాలో అనేదానిపై పెద్ద ప్రణాళిక వేసుకుంటా. నా సమస్య ఏమిటంటే వేసుకున్న ప్లాన్‌ను కొన్నిరోజులు పాటిస్తా. ఆ తర్వాత వదిలేస్తా. రెండు మూడు ఏళ్లుగా ఇలానే అవుతోంది. నేనేం చేయాలి? -రమ్య, హైదరాబాద్‌
గతేడాది అనుకుని పూర్తి చేయలేని లక్ష్యాలను కొత్త సంవత్సరంలోనైనా పూర్తి చేయాలనుకుంటారు కొందరు. అలాగే మరికొందరూ మరికొన్ని కొత్త పనులను చేయాలని అనుకుంటారు. నూతన సంవత్సరంలో కొంతైనా మార్పు ఉండాలనే ఉద్దేశం మంచిదే. అలాగే పక్కవారు పాటిస్తున్నారనో, సమాజంలో చేస్తున్నారనో ... వారినీ అనుసరించేవారుంటారు. భవిష్యత్తులో మంచి పనులు చేయాలని నిర్ణయించుకోవడం సానుకూల దృక్పథమే. మనలో మార్పు రావడానికి ఈ ఆలోచన దోహదపడుతుంది. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి  ప్రయత్నంతోపాటు ఆ వ్యక్తి స్వభావం, చుట్టూ పరిస్థితులూ ముఖ్య పాత్ర వహిస్తాయి. వేరొకరి కోసం చేయాలనుకునే లక్ష్యాలు ఆదిలోనే వీగిపోతాయి. ఇతరుల కోసం కాకుండా మీ లక్ష్యసాధన కోసం కృషిచేయాలి. ఆ తపన మీలో నుంచి మొదలవ్వాలి. చాలామంది ప్రణాళిక వరకే ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే  అనుకున్నది సాధించగలుగుతారు.
మీరేం చేయాలంటే.: లక్ష్య సాధన కోసం మీరు వేసుకునే ప్రణాళికలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. భారీ లక్ష్యాలను పెట్టుకుని చేరుకోకపోయేసరికి నిరాశ చెందవద్దు. ముందుగా ఒకట్రెండు  చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. వాటి సాధన కోసం శ్రమించండి. అలాగే మీరు చేయగలరనే వాటిని మాత్రమే తీసుకోవాలి. ఒకట్రెండు రోజులు పట్టుదలగా చేసి మూడో రోజు ఆపేయకూడదు. ఏ లక్ష్యమైనా కొంతకాలం ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. మీ లక్ష్య సాధనకు కావాల్సిన పరిస్థితులు, వ్యక్తులు, వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. లక్ష్యం చిన్నదైనా దాన్ని పొందేందుకు కష్టపడాలి. ఫలితం కొంత వరకే వచ్చినప్పుడు నిరాశ చెందవద్దు. తరచూ ఆత్మ విమర్శ చేసుకోవాలే తప్ప మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. చేసినదానికి తృప్తిపడుతూ మిగతా సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగించాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని