close

తాజా వార్తలు

Published : 04/01/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టమేటో టెక్నిక్‌!

పాఠ్యపుస్తకాలను కొంత సమయం చదవగానే ఇతర అంశాలపై దృష్టి మళ్లటమో, అలసిపోవటమో జరుగుతుంది. మరి ఎక్కువ సమయం ఏకాగ్రతŸతో చదవటం ఎలా? ఇందుకో చిట్కా ఉంది. అదే ‘ పొమడొరో (టమేటో) టెక్నిక్‌’!
ఈ టెక్నిక్‌ను అనుసరిస్తే.. హైరానా పడకుండా హాయిగా మనసు కేంద్రీకరించి చదువుకోవచ్చు. 

* చదవాల్సిన చాప్టర్ల జాబితా పెట్టుకోవాలి.
* 25 నిమిషాలకు టైమర్‌ను పెట్టుకోవాలి.
* టైమర్‌ మోగేదాకా చదవాలి.
* 3-5 నిమిషాల విరామం తీసుకోవాలి.
* మరో 25 నిమిషాలు చదివి, 5 నిమిషాల విరామం తీసుకోవాలి.
* ఇలా 4 సార్లు చేశాక 15- 30 నిమిషాల విరామం తీసుకోవాలి.


ఇలా విరామాలిస్తూ పఠనం కొనసాగిస్తే సంపూర్ణ విషయ అవగాహన సాధ్యమవుతుంది. ప్రతి విరామాన్నీ ‘పొమడొరో’ అంటారు. టమేటో ఆకారంలో ఉండే కిచెన్‌ టైమర్‌ పేరును బట్టి ఇది వాడుకలోకి వచ్చింది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని