close

తాజా వార్తలు

Updated : 08/01/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ లైబ్రరీ... మహిళలకు మాత్రమే!

సాధారణంగా లైబ్రరీలో అడుగుపెడితే మగవాళ్లూ, ఆడవాళ్లూ ఇద్దరూ కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే పురుషులే ఎక్కువగా ఉంటారు. కానీ రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఉన్న ఈ లైబ్రరీలో అడుగుపెడితే మాత్రం కేవలం మహిళలే కనిపిస్తారు. ఎందుకంటే ఈ గ్రంథాలయం మహిళలకు ప్రత్యేకం కాబట్టి... 43ఏళ్లుగా స్త్రీల కోసమే ఈ గ్రంథాలయం నడుస్తుందంటే విశేషమేగా మరి. ఇంట్లో పనంతా చేసి ఓ మంచి కాఫీ లాంటి పుస్తకం చదవాలనుకునే గృహిణులే కాదు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలూ, ఉద్యోగినులూ, మలివయసులో పుస్తక పఠనం చేయాలనుకునే బామ్మలూ అందరూ ఇక్కడికి వస్తుంటారు. ఈ లైబ్రరీ అరుదైన, అపురూపమైన ఏడువేల పుస్తకాలతో నిత్యం కళకళలాడుతుంది. ఇందులో పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకమైన పత్రికలు, మ్యాగజైన్లను ఉంచుతున్నారు. పిల్లలు కూడా ఇక్కడకు వచ్చి కథల పుస్తకాల్ని చదువుకోవచ్చు. 1977లో ప్రారంభించిన ఈ గ్రంథాలయాన్ని... 2013లో దానవాయిపేట పార్కులో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. ప్రస్తుతం 670 మంది దీంట్లో సభ్యులుగా ఉన్నారు.

- వై.సూర్యకుమారి, రాజమహేంద్రవరం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని