close

తాజా వార్తలు

Updated : 11/01/2021 06:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష్య దిశగా..

జీవన నైపుణ్యాలు - 4

మీ బలాలు ఏమిటి? పరిమితులేమిటి? మీకు ఆసక్తి ఉన్న రంగాల అవసరాలపై అవగాహన ఉందా? వాటిలో రేపటి అవకాశాలకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలచుకోగలరా?
మధు, వెంకట్‌ ఇద్దరూ సమీపంలోని చిన్న గ్రామాల నుంచి హైదరాబాద్‌కి ఇంజినీరింగ్‌ చదువుకోవడానికి వచ్చారు. ఇద్దరిదీ దాదాపుగా ఒకే విధమైన ఆర్థిక నేపథ్యం. చిన్న ఊరు నుంచి మహానగరానికి రాగానే మధులో చాలా మార్పు వచ్చింది. చదువు మీదకంటే ఇతర విషయాలపై ధ్యాస ఎక్కువైంది. ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక సాకు చెప్పి డబ్బు తెప్పించుకోవడం, జల్సాగా ఖర్చు చేయడం అలవాటైంది. నాలుగేళ్లు గడిచేసరికి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులతో మళ్లీ సొంత ఊరు చేరాడు.
కాలేజీలో సరదాగా గడిపే చాలామంది కంటే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి వేరని వెంకట్‌ గుర్తించాడు. చదువుపైనే ధ్యాసపెట్టి ఆరో సెమిస్టర్‌ దాటేసరికి తరగతిలో అందరి కంటే మెరుగ్గా ఉన్నాడు. త్వరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు మొదలవుతాయని తెలుసు. కానీ సివిల్స్‌ వైపు వెళ్లి తన తండ్రిలాంటి లక్షలాది రైతుల వ్యధ తీర్చేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. దృఢ సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యాడు.
మధు- వెంకట్‌ల ప్రయాణంలో వెంకట్‌ని సరైన దిశగా నడిపించిందేమిటి? స్వీయ నిర్వహణ (సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌)! మనుషుల్ని తీర్చిదిద్దే జీవన నైపుణ్యం!


ఇంతకీ ఏమిటిది?

సొంత బలాలు, పరిమితులు, తాను ప్రవేశించాలనుకుంటున్న రంగ అవసరాలు, భవిష్యత్‌ అవకాశాలను గుర్తించి వీటికి తగ్గట్టు తనను తాను మలచుకోవడమే- స్వీయ నిర్వహణ.కెరియర్‌లో ఉన్నత సోపానాలను ఎక్కేందుకు ఇదే పునాది. ఈ కౌశలాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
స్వీయ అవగాహన: ముందుగా తనపై తన శక్తియుక్తులపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. బలాలు, పరిమితులపై వాస్తవ దృక్పథంతో అంచనా వేసుకోవాలి. స్వీయ మానసిక ఉద్వేగాలపైనా అవగాహన పెంచుకోవాలి.
ఇతరులను అర్థం చేసుకోగలగడం: మన గమనం ఇతరులపై ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని సదా మనసులో ఉంచుకోవాలి. మనకు ఆనందం, దుఃఖం, ఆశ, నిరాశ, భయం లాంటి అనుభూతులు ఎలా ఉంటాయో అలాగే వివిధ సందర్భాల్లో తన చుట్టూ ఉన్నవారి స్పందనల పట్లా అవగాహన ఉండాలి.

- యస్‌.వి. సురేష్‌


‘నాకు అమిత సంతోషంగా ఉంది’  అని ఇంగ్లిష్‌లో మెరుగ్గా ఎలా చెప్పొచ్చు?
ఈ సందర్భానికి సరిపోయే, బాగా ప్రాచుర్యంలో ఉన్న idiomsను చూద్దాం. వాక్యాల్లో ప్రయోగాన్నీ గమనిద్దాం!


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని