
తాజా వార్తలు
‘నమస్తే ట్రంప్’లో ‘బాహుబలి’ పాటలు
దాదాపు లక్షా పాతికవేల మందితో ‘దండాలయ్య’ సాంగ్
న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘బాహుబలి’ పాటలు మారుమోగనున్నాయి. ట్రంప్ రాకకు గౌరవంగా ‘బాహుబలి’ చిత్రంలోని ‘జై జై కారా (దండాలయ్య)’ అనే పాటను దాదాపు లక్షా పాతిక వేల మందితో కలిసి అలపించనున్నట్లు ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ చెప్పారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్రమోదీ, ట్రంప్ స్టేడియంలోకి రాగానే గౌరవ సూచికంగా ‘బాహుబలి’ చిత్రంలోని మరో పాటను కూడా ఆలపించనున్నట్లు ఖేర్ వెల్లడించారు. కుదిరితే తన పాటలకు ట్రంప్ చేత డ్యాన్స్ చేయిస్తానంటూ ఖేర్ సరదాగా వ్యాఖ్యానించారు.
Tags :