బీటెక్‌లో నాలుగు.. ఎంటెక్‌లో ఏడు
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీటెక్‌లో నాలుగు.. ఎంటెక్‌లో ఏడు

2021-22 సంవత్సరానికి కొత్త కోర్సులకు జేఎన్‌టీయూ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో 2021-22 సంవత్సరానికి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో నాలుగు, ఎంటెక్‌లో ఏడు కోర్సులు అనుమతించేందుకు నిర్ణయించింది. ఏఐసీటీఈ సూచన మేరకు వీటిని తీసుకువస్తున్నట్లు జేఎన్‌టీయూ సోమవారం ప్రకటించింది. ఆయా కోర్సులు కావాలనుకునే కళాశాలలు నేరుగా 18లోగా ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.
కొత్త కోర్సులు..
బీటెక్‌: సీఎస్‌ఈ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- డాటాసైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-మెషిన్‌ లెర్నింగ్‌  
* మెకానికల్‌ విభాగంలో ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌
ఎంటెక్‌లో: సీఎస్‌ఈ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ.
* సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సివిల్‌ ఇంజినీరింగ్‌(కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌)
* ఈసీఈలో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మెకాట్రానిక్స్‌.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని