మోది మెచ్చిన కళాకారిణి...
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 03:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోది మెచ్చిన కళాకారిణి...

అందమైన అమ్మాయిని చూస్తే... బాపు బొమ్మలా ఉన్నావు అంటారు. అయితే ఈ బొమ్మలను చూస్తే అచ్చం అమ్మాయిల్లాగే ఉన్నాయనడం మాత్రం ఖాయం.  ఇంత అందమైన బొమ్మలకు ప్రాణం పోసింది రాంచీకి చెందిన హస్తకళాకారిణి 48 ఏళ్ల శోభాకుమారి. తనకు తెలిసిన ఈ కళను తోటి  మహిళలకు ఉచితంగా నేర్పించి స్వయం ఉపాధిని కల్పించడంతో ఈమెను ఇటీవల ప్రధాని ప్రశంసించడం విశేషం.

ట్టి, కాటన్‌ వస్త్రంతో తయారవుతున్న ఈ అందమైన బొమ్మలను శోభ పదేళ్ల నుంచి చేస్తున్నారు. వీటి తయారీని మొదలుపెట్టిన తొలినాళ్లలో మనదేశ సంప్రదాయ వస్త్రధారణనే ప్రధానంగా తీసుకున్నారీమె. దాంతో దేశవ్యాప్తంగా మహిళల వస్త్రధారణలపై అధ్యయనం చేశారు. ప్రత్యేకంగా గ్రామీణ పడతుల బొమ్మల సహజసిద్ధంగా రూపొందించడంలో ఈమె తన ప్రత్యేకతను చాటుతున్నారు. ఉపాధి లేని మహిళలకు ఉచితంగా శిక్షణనిచ్చి వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయూతనందిస్తున్నారు. అలా వందలమంది ఈ కళ ద్వారా స్వయంఉపాధిని పొందారు. ఒక్కొక్కరు సగటున నెలకు రూ.30 వేలు వరకు ఆర్జిస్తున్నారు. 

బాల్యం నుంచి...
చిన్నప్పటి నుంచి తనకు కళలంటే ఇష్టమని చెబుతారు శోభ. ‘చిన్న వస్త్రం లేదా ఏదైనా వృథా వస్తువు చేతికి దొరికితే చాలు, దాన్ని బొమ్మగా మార్చేసేదాన్ని. స్కూల్‌బ్యాగు నుంచి నేను వేసుకునే దుస్తుల వరకు అన్నీ చేత్తోనే కుట్టేదాన్ని. ఓసారి రాజస్థాన్‌ అమ్మాయి బొమ్మను తయారుచేస్తే అందరూ ప్రశంసించారు. దాంతో దీన్నే కెరీర్‌గా మార్చుకున్నా. అలా మొదలైందే ‘శ్రీజన్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌’. మొదట నేను తయారుచేసిన బొమ్మలను ఇంటింటికీ తిరిగి విక్రయించేదాన్ని. ఆ తర్వాత వారాంతపు సంతలు, ఎగ్జిబిషన్స్‌లో స్టాళ్లు పెట్టేదాన్ని. దాంతో వీటి గురించి చాలామందికి తెలిసింది. అలా సోషల్‌మీడియాలోకీ అడుగుపెట్టా. ఇప్పటికి కొన్ని వేల బొమ్మలను విక్రయించా. దేశవిదేశాల్లో వీటికి అభిమానులున్నారు. వర్ణభరితమైన దుస్తుల్లో మెరిసిపోయే వీటి తయారీ వెనుక చాలా కష్టం ఉంది. సంప్రదాయానికి తగ్గట్లుగా దుస్తులు, ఆభరణాలు వంటివి ఎంపిక చేయడం, ఆర్డరు బట్టి రెండు అంగుళాల నుంచి ఐదడుగుల ఎత్తు వరకు తయారుచేయడానికి ఒక బొమ్మకు కనీసం 25 నుంచి 30 గంటలు పడుతుంది. నావద్ద 30 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఉచిత శిక్షణతో పేద మహిళలకు సాధికారత కల్పించానని ప్రధాని మోదీ నన్ను ప్రశంసించడం మరవలేను’ అని అంటారు శోభ.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని