ఇది ఫ్రిజ్‌ కాదు... చిరు గ్రంథాలయం
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ఫ్రిజ్‌ కాదు... చిరు గ్రంథాలయం

ఇంట్లోని వస్తువులు మరమ్మతుకు గురైతే వాటిని పారేస్తాం. లేదా తక్కువ ధరకు విక్రయిస్తాం. అయితే కోల్‌కతాకు చెందిన కుమ్‌కుమ్‌ హల్దార్‌ మాత్రం అవి ప్రజలకు ఉపయోగపడాలని అనుకుంది. అందుకోసం వృథాగా ఉన్న ఫ్రిజ్‌నే చిరు గ్రంథాలయంగా మార్చేసింది. పాటూలీకి చెందిన కుమ్‌కుమ్‌, ఆమె భర్త కాళిదాస్‌ పుస్తక ప్రియులు. పుస్తకాల నుంచి అందే విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఆ దంపతులు ఆ ఫ్రిజ్‌నిండా పుస్తకాలు నింపి దాన్ని అందరూ వచ్చిపోయే కిరాణా దుకాణం దగ్గర ఉంచారు. ఇందులో పుస్తకాలు ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లి చదువుకోవచ్చంటూ బోర్డు పెట్టారు. అయితే వీటిలో ఒక పుస్తకాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలని, కనీసం నెల రోజుల్లోపు దాన్ని జాగ్రత్తగా తిరిగివ్వాలంటూ షరతు పెట్టారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ చిరుగ్రంథాలయం వైరల్‌ అవుతుండగా, కోల్‌కతా వీధుల్లో ఈ తరహాలో వీధి గ్రంథాలయాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన హల్దార్‌ దంపతులను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని