మరోసారి చెబుతున్నా.. ఫాలో కావొద్దు
close

తాజా వార్తలు

Published : 22/03/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి చెబుతున్నా.. ఫాలో కావొద్దు

కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌

హైదరాబాద్‌: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో తనకి ఖాతా లేదని కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. తన పేరుతో ఉన్న అకౌంట్‌ను ఎవరూ ఫాలో కావొద్దని నెటిజన్లకు సూచించారు. ఈ మేరకు తాజాగా వైష్ణవ్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నేను ట్విటర్‌లో భాగం కాదు. అందులో నాకు ఎలాంటి ఖాతా లేదు. ఫేక్‌ ట్విటర్‌ ఖాతాలను ఫాలో కావొద్దని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే, అలాంటి ఖాతాల గురించి రిపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని వైష్ణవ్‌ పేర్కొన్నారు.

‘ఉప్పెన’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌కు మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ లభించింది. యువతలో ఆయనకు ఫాలోయింగ్‌ మొదలైంది. దీంతో ఆయనకు సంబంధించిన అన్నిరకాల సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించే వారి సంఖ్య పెరిగింది. వైష్ణవ్‌ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతా వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు సైతం అది అధికారిక ఖాతానే అనుకుని ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాను ట్విటర్‌లో లేనని.. అది తన ఖాతా కాదని ఇటీవల వైష్ణవ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని