ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా: హారిక
close

తాజా వార్తలు

Published : 11/03/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా: హారిక

వీడియో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు నటి అలేఖ్య హారిక తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని షేర్‌ చేశారు. ‘‘మహిళా దినోత్సవం రోజున టీఎస్‌టీడీసీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నన్ను నియమించిన విషయం మీ అందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. నన్ను సపోర్ట్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక నుంచి సిరీస్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తాను.’’ అని హారిక పేర్కొన్నారు.

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) అలేఖ్య హారిక (దేత్తడి ఫేం)ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నియామకం చేపట్టారంటూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హారికను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా ఆమెకు నియామక పత్రం అందించారు. ఈ నిర్ణయం వివాదం కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం పర్యాటక అభివృద్ధి సంస్థను వివరణ అడిగింది. ఈ క్రమంలోనే అలేఖ్య హారిక తాజాగా ఈ వీడియోని షేర్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని