Sundeep Kishan: అనాథ పిల్లలుంటే చెప్పండి
close

తాజా వార్తలు

Published : 04/05/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sundeep Kishan: అనాథ పిల్లలుంటే చెప్పండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెకండ్‌ వేవ్‌ కరోనా వల్ల దేశంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అభం శుభం తెలియని పసివాళ్లు అనాథలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సినిమా ప్రముఖులు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. తాజాగా.. యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌  తన ఉదారత చాటుకున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు.

‘‘ఇది కఠినమైన సమయం. కరోనా వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల వివరాలు నాకు పంపించండి. నేను, నా టీమ్‌ కలిసి మాకు చేతనైనంత వరకు వాళ్లను సంరక్షిస్తాం. మంచి ఆహారం అందించడంతో పాటు కొన్నేళ్లు వారిని చదివిస్తాం. మానవత్వం కలిగిన మనుషులుగా ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి.. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండి’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అనాథ బాలల వివరాలు తనకు మెయిల్‌ చేయాలంటూ.. మెయిల్‌ అడ్రస్‌ sundeepkishancovidhelp@gmail.com ఇచ్చారు. నటి శ్రుతిహాసన్‌ కూడా బాలల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దయచేసి ఎవరికి వాళ్లు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకోవాలని.. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని మరో నటి అనుష్కశెట్టి పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని