అలాంటి కామెంట్లు తట్టుకోవడం కష్టం : సమీరారెడ్డి
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి కామెంట్లు తట్టుకోవడం కష్టం : సమీరారెడ్డి

ముంబయి: బాలీవుడ్‌తోపాటు దక్షిణాది పరిశ్రమలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సమీరా రెడ్డి. వివాహం అనంతరం వెండితెరకు దూరమైన ఈ నటి.. తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఫన్నీ వీడియోలతో నెటిజన్లను ఆకర్షించే సమీరా తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్టు‌ పెట్టారు.

తన టీనేజ్‌ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. అప్పట్లో తాను బాగా లావుగా ఉండేదాన్నని.. దాంతో అందరూ నెగెటివ్‌గా కామెంట్లు చేసేవాళ్లని సమీరా తెలిపారు. శరీరాకృతిపై బయటి వాళ్లు చేసే కామెంట్లు తట్టుకోవడం ఎంతో కష్టమైన విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా, సమాజంలో ఉండే ప్రతివిషయాన్ని ఓర్పుగా  ఎదుర్కోవాలని, ఎలాంటి వారినైనా సరే ఒకేలా చూడాలనే విషయాన్ని తన పిల్లలకు నేర్పుతానని నటి వివరించారు.

‘నరసింహుడు’తో కథానాయికగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమీరారెడ్డి ‘జై చిరంజీవా’, ‘అశోక్‌’, చిత్రాలతో మెప్పించారు. అనంతరం ఆమె ‘కృష్ణం వందే జగద్గురుం’లో ప్రత్యేక గీతంలో కనిపించారు. 2013లో విడుదలైన ‘వరద నాయక’ అనే కన్నడ చిత్రం తర్వాత సమీరా రీల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని