Keerthy Suresh: తొలి సంపాదన ఎంతో తెలుసా?
close

తాజా వార్తలు

Published : 04/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Keerthy Suresh: తొలి సంపాదన ఎంతో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రకి ప్రాణం పోసి మహానటి అనిపించుకుంది కీర్తి సురేశ్‌. తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందిన వారే కావడంతో బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చిందీ ముద్దుగుమ్మ. చిన్నప్పుడే పారితోషకం అందుకున్న కీర్తిని మీ తొలి సంపాదన ఎంత అని అడగ్గా ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను నటించినందుకు నిర్మాతలు నా చేతికి డబ్బుల కవర్ ఇచ్చేవారు. దాన్ని తీసుకుని నాన్నకి ఇచ్చేదాన్ని. ఇప్పటికీ ఆ డబ్బెంతో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేటపుడు ఒక షోల్లోనూ పాల్గొన్నాను. అలా ఓసారి రూ.500 తీసుకున్నాను. ఊహ తెలిశాక అందుకున్నది కాబట్టి ఇదే నా తొలి సంపాదనగా భావించాను. దీన్నీ సెంటిమెంట్‌గా నాన్నకే ఇచ్చేశాను’ అని తెలియజేసింది. 

‘రంగ్‌ దే’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన కీర్తి ప్రస్తుతం రజనీ కాంత్‌ ‘అన్నాత్తే’, మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని