Vakeelsaab: కంటిపాప ఫుల్‌ వీడియో చూశారా
close

తాజా వార్తలు

Published : 04/05/2021 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vakeelsaab: కంటిపాప ఫుల్‌ వీడియో చూశారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వకీల్‌ సాబ్’ నుంచి మరో ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది. కంటిపాప కంటిపాప అనే మెలోడీని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. పవన్‌ కల్యాణ్‌, శ్రుతి హాసన్‌పై తెరకెక్కిన గీతమిది. ఈ పాటలో పవన్‌, శ్రుతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. వీళ్ల ప్రేమ, పెళ్లి, శ్రుతి సీమంతం తదితర సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

బాలీవుడ్‌లో విజయం అందుకున్న ‘పింక్‌’ ఆధారంగా శ్రీరామ్‌ వేణు ‘వకీల్‌ సాబ్‌’ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఇటీవల థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అలరిస్తోంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ ఫుల్‌ వీడియో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని