పవన్‌ సరసన నిత్య.. ఆ పాత్రలోనేనా...?
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ సరసన నిత్య.. ఆ పాత్రలోనేనా...?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్ భార్య పాత్రలో నిత్య మేనన్‌ కనిపించనుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో ఇద్దరు నాయికలుగా చోటుండగా రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ ఎంపికైంది. పవన్‌ సరసన సాయి పల్లవి నటిస్తోందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దానిపై స్పష్టత రాకపోగా అనివార్య కారణంగా సాయి పల్లవి ఈ ప్రాజెక్టులో నటించడంలేదని,  ఆ స్థానంలో నిత్య మేనన్‌ భర్తీ చేయనుందని కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల చిత్ర బృందం నిత్యని సంప్రదించిందని, నిత్య ఓకే చెప్పిందని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందులో పవన్‌ భార్యగా కనిపించనుందని తాజా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని