నా సోదరుడు ఇకలేడు: పియా
close

తాజా వార్తలు

Published : 04/05/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా సోదరుడు ఇకలేడు: పియా

ఉత్తర ప్రదేశ్‌‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ తన బలాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. దాన్ని ఎదుర్కొనే పోరాటంలో కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. కుటుంబ సభ్యుల మరణ వార్త విని ఎన్నో హృదయాలు ముక్కలవుతున్నాయి. యువ నటి పియా బాజ్‌ పాయ్‌ ఇంట్లో ఇదే విషాదం నెలకొంది. చావుబతుకుల మధ్య ఉన్న తన సోదరుడ్ని కాపాడుకోలేకపోయింది. ‘ఫరూఖాబాద్‌ జిల్లాలోని కయంగంజ్‌ బ్లాక్‌లో నివసించే నా సోదరుడు కొవిడ్‌ కారణంగా కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి బెడ్‌, వెంటిలేటర్‌ అత్యవసరం. వీటి ఏర్పాటుకు దయచేసి ఎవరైనా సాయం చేయండి’ అని పియా ట్విటర్‌ వేదికగా వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ‘నా సోదరుడు ఇకలేడు’ అంటూ మరో ట్వీట్‌ చేసింది. ‘నిన్ను కలిశాక’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది పియా. ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’, ‘దళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని