పోలాండ్‌ బాలుడి నోట ‘పెళ్లి సందడి’ పాట
close

తాజా వార్తలు

Published : 02/05/2021 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలాండ్‌ బాలుడి నోట ‘పెళ్లి సందడి’ పాట

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలాండ్‌కి చెందిన 12 ఏళ్ల జిబిక్స్‌ (బుజ్జి) ‘పెళ్లిసందD’ చిత్రంలోని ప్రేమంటే ఏంటి పాటను అలవోకగా పాడి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తాజాగా ఈ పాట ప్రోమోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. రోషన్‌, శ్రీలీల జంటగా గౌరి రోణంకి తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘పెళ్లిసందD’. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోంది. కీరవాణి సంగీత అందిస్తున్నారు. వీడియో చూసి ఈ పాటని రాసిన చంద్రబోస్ స్పందిస్తూ.. ‘బుజ్జినోట మా పాట’ అని రీ ట్వీట్‌ చేశారు. ‘నీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్‌. దీంతో బుజ్జి గానం నెట్టింట వైరల్‌ అవుతోంది. తెలుగు భాష తెలియకపోయినా తెలుగు పాటలు చాలా చక్కగా పాడుతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో ‘దొరసాని’ చిత్రంలోని నింగిలోని పాలపుంత పాటతో అలరించాడు. జాతీయ గీతాన్ని ఆలపించి భారతదేశంపై ప్రేమని చాటుకున్నాడు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని