అతను ఫేమస్‌ కావాలని చూస్తున్నాడు..
close

తాజా వార్తలు

Published : 05/05/2021 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతను ఫేమస్‌ కావాలని చూస్తున్నాడు..

ప్రముఖ డిజైనర్‌పై కంగన సోదరి ఆగ్రహం

ముంబయి: తన సోదరి కంగనా రనౌత్‌ పేరు చెప్పుకుని డిజైనర్‌ ఆనంద్‌ భూషణ్‌ ఫేమస్‌ కావాలనుకుంటున్నాడని రంగోలీ అన్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఉద్దేశిస్తూ.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గత కొన్నిరోజుల క్రితం కంగన ట్విటర్‌ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మంగళవారం కంగన ఖాతాను ట్విటర్‌ యాజమాన్యం పూర్తిగా తొలగించింది. దీంతో  తన బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకునే క్రమంలో కంగనాతో కలిసి చేసిన ఫొటోషూట్స్‌ అన్నింటినీ తక్షణమే తొలగిస్తున్నట్లు డిజైనర్‌ ఆనంద్‌ భూషణ్‌ ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తులో సైతం ఆమెతో కలిసి పనిచేయనని అన్నారు.

కాగా, ఆనంద్‌ ప్రకటనపై తాజాగా రంగోలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కంగన పేరు ఉపయోగించుకుని ఆనంద్‌ మైలేజ్‌ పొందాలనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే మేము అతనితో భాగస్వామ్యం కాలేదు. మాకు అతను ఎవరో కూడా సరిగ్గా తెలీదు.  దేశంలోనే ప్రముఖ నటి అయిన కంగన పేరు ఉపయోగించి ప్రమోషన్‌ పొందాలని ఆ  వ్యక్తి భావిస్తున్నట్లు ఉన్నాడు.  ఇలాంటి వ్యక్తులను ఊరికే వదలకూడదు. అతడిపై  కోర్టులో దావా వేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆనంద్‌.. కోర్టులో కలుసుకుందాం’ అని రంగోలీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని