
తాజా వార్తలు
తల్లికాబోతున్న హీరోయిన్ రిచా
హైదరాబాద్: కథానాయిక రిచా గంగోపాధ్యాయ్ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆదివారం ఉదయం ట్విటర్ వేదికగా బేబీ బంప్‌తో ఉన్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ఎంతోకాలం నుంచి ఓ విషయాన్ని మేము రహస్యంగా దాచి ఉంచాం. ఈ రోజు మీ అందరికీ ఆ విషయాన్ని తెలియజేయడం మాకెంతో ఆనందంగా ఉంది. జూన్ నెలలో మా కుటుంబంలోకి ఓ చిన్నారి రానుంది. మేము ప్రస్తుతం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాం. మా చిన్నారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాం’ అని రిచా ప్రకటించారు.
‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ్.. ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడి బిజినెస్ స్కూల్లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు.