ట్విటర్‌పై రష్యా ఆంక్షలు..!
close

తాజా వార్తలు

Published : 10/03/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌పై రష్యా ఆంక్షలు..!

దేశ చట్టాలకు అనుగుణంగానే పనిచేయాలని స్పష్టం

మాస్కో: సామాజిక మాధ్యమం ట్విటర్‌పై రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలో స్పీడ్‌ తగ్గించింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. పిల్లలలో ఆత్మహత్యలను ప్రేరేపించడం, డ్రగ్స్‌, చైల్డ్‌ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో ట్విటర్‌ విఫలమైందని రష్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ వెల్లడించింది. దీనిపై ట్విటర్‌ సరైన రీతిలో స్పందిస్తుందనే నమ్మకం ఉందని..అయితే, రష్యా చట్టాలను అమలు చేయకపోతే పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరించింది.

ట్విటర్‌పై ఆంక్షలు విధించే అంశంపై రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రియ్‌ పెస్కోవ్‌ స్పందించారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదని, కానీ, చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేశారు.

ఆంక్షలు అందుకేనా..?

ట్విటర్‌పై రష్యా ఆంక్షలు విధించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యా ప్రతిపక్ష నాయుకుడు అలెక్సీ నావెల్నీని ప్రభుత్వం అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన్ను విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను ఏకతాటిపై తీసుకురావడంలో ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలే కీలకంగా వ్యవహరించాయని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నిరసనల్లో పాల్గొనాలని పిల్లలకు పిలుపునివ్వడం వంటి చర్యలను అక్కడి ప్రభుత్వం తప్పుబడుతోంది. రష్యా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఇటువంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలని రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఇలా కంటెంట్‌ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ట్విటర్‌ పట్టించుకోకపోవడంతోనే ఈ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని