ప్రియుడితో పిక్‌.. ఇన్నాళ్లు షేర్‌ చేయలేదు 
close

తాజా వార్తలు

Published : 21/04/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడితో పిక్‌.. ఇన్నాళ్లు షేర్‌ చేయలేదు 

#Ask To Meలో శ్రుతి ఏమన్నారంటే

హైదరాబాద్‌: సుమారు మూడేళ్ల విరామం తర్వాత తిరిగి వెండితెరపై వెలుగులు పూయిస్తోంది నటి శ్రుతిహాసన్‌. చూపరులను ఆకర్షించే అందం.. భిన్నమైన హావభావాలతో ఎంతోమందికి చేరువైన ఈ బ్యూటీ ఇటీవల ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’లతో టాలీవుడ్‌లో వరుస విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టా వేదికగా #Ask To Me పేరుతో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తన ప్రియుడు శాంతానుతో దిగిన ఓ స్పెషల్‌ ఫొటోని నెట్టింట్లో షేర్‌ చేశారు. ఇప్పటివరకూ ఆ ఫొటోని ఎవరూ చూడలేదని ఆమె పేర్కొన్నారు.

శ్రుతి.. మీకిష్టమైన సినిమా ఏది?

ది గాడ్‌ ఫాదర్‌, ఎటర్‌నల్‌ సన్‌షైన్‌

ఇష్టంగా తినే ఆహారం?

దక్షిణాది విందు భోజనం

ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌?

చంపేస్తానంటూ బెదిరించే విధంగా ఉన్న ఎమోజీ

మీ ఫోన్‌లో ఎన్ని ఫొటోలున్నాయి?

51,574 ఫొటోలు, 9373 వీడియోలు

ఇప్పటివరకూ సోషల్‌మీడియాలో షేర్‌ చేయని మీకిష్టమైన ఫొటో ఏది?

మీకిష్టమైన కలర్‌

నలుపు

ఇష్టమైన పువ్వులు?

గులాబీలు

నెట్‌ఫ్లిక్స్‌లో ఇష్టమైన సిరీస్‌?

ది క్రౌన్‌

మీరు ఇష్టంగా చదివే పుస్తకం?

ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ ది సి

మీరు ఎక్కువ తినే చాక్లెట్‌?

డైరీ మిల్క్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌

ఇష్టమైన ప్రాంతం

లండన్‌

మీ ఫేవరెట్‌ ఫొటో?

మీ చిన్ననాటి ఫొటో ఏదైనా షేర్‌ చేయగలరు?

మీకిష్టమైన ఫీల్‌ గుడ్‌ మూవీ?

క్లూలెస్‌

ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌?

ఫైట్‌

మీకిష్టమైన దేశం?

భారతదేశం

ఇష్టమైన ఐస్‌క్రీమ్‌

వెనిలా.. బోర్‌ కొట్టినప్పటికీ రుచి బాగుంటుంది

ఇష్టమైన హారర్‌ మూవీ?

ది ఓమెన్‌

ఇష్టమైన పండు?

సీతాఫలం

మీ మొట్టమొదటి ఫోన్‌?

నోకియా 3100

మీ ఫేవరెట్‌ బీచ్‌

పోర్చుగల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని