close

తాజా వార్తలు

Published : 01/03/2021 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సుధీర్‌ 14’.. టైటిల్‌ ఇదే

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సుధీర్‌ బాబు హీరోగా మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సుధీర్‌ 14’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా పేరును తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికర టైటిల్‌ని ఖరారు చేశారు. సోమవారం చిత్రీకరణ ప్రారంభించినట్టు చిత్ర వర్గాలు తెలియజేశాయి. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత మోహన్‌ కృష్ణ- సుధీర్‌ కలయికలో వస్తోన్న చిత్రమిది. మరోవైపు కరుణ కుమార్‌ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రంలో నటిస్తున్నారు సుధీర్‌.



ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని