
తాజా వార్తలు
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
ఆకట్టుకుంటోన్న వీడియో
హైదరాబాద్: ‘‘ప్రేమకథలు నచ్చని మనుషులు ఉండరు కదా. ఎందుకంటే ప్రేమ లేని జీవితం ఉండదు కనుక!’’ అని అంటున్నారు కథానాయకుడు సుధీర్. ఆయన ప్రధాన పాత్రలో ఓ అపురూప ప్రేమకథాచిత్రం తెరకెక్కనుంది. కృతిశెట్టి కథానాయిక. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. సుధీర్14వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా టైటిల్‌ని మార్చి 1 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోని అభిమానులతో పంచుకుంది.
‘‘నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదటిసారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలుపెడతాడు. అయితే, అబ్బాయిలందరూ ఒక్కసారి సరదాగా గుర్తుతెచ్చుకోండి. మొదటిసారి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలుపెట్టారు? కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నాకు తెలిసి చాలామంది నాలాగే మొదలుపెట్టి ఉంటారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? మార్చి ఒకటో తేదీ వరకూ వేచి చూడండి’’ అంటూ ఆ వీడియోలో సుధీర్‌బాబు పేర్కొన్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరాలు అందించనున్నారు.