
తాజా వార్తలు
అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
ఇంటర్నెట్ డెస్క్: గతంలో ‘మర్యాద రామన్న’గా వచ్చి నవ్వులు పండించారు సునీల్. ఇప్పుడు ‘మర్యాద క్రిష్ణయ్య’ అవతారమెత్తి మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సునీల్ హీరోగా వి.ఎన్. ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆదివారం సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. తలుపు చాటున దాక్కుని భయంగా చూస్తున్నట్టు కనిపించారు సునీల్ ఈ పోస్టర్లో. సీరియస్ లుక్‌లోనూ కామెడీ పంచుతున్నారు.
‘మీ అందరి నవ్వులు దోచుకునే దొంగ’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాను ఎ టీవీ ఒరిజినల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మరి మర్యాద క్రిష్ణయ్య కథేంటి? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
ఇవీ చదవండి
Tags :