close

తాజా వార్తలు

Published : 24/02/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తలైవి’ వచ్చేది అప్పుడే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ బయోపిక్‌లో తలైవిగా బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కనిపించనుంది. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా చిత్రబృందం విడుదల తేదీని వెల్లడించింది. ఏప్రిల్‌ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వాస్తవానికి గతేడాది జూన్‌ 26న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తికాకపోవడంతో విడుదల ఆలస్యమైంది. ఈ చిత్రంలో జయలలితగా కంగన, ఎంజీఆర్‌గా అరవింద్‌స్వామి కనిపించనున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌, శశికళ పాత్రలో పూర్ణ నటించారు.



ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని