అప్పుడు.. ఇప్పుడూ ఆమే నా క్రష్‌
close

తాజా వార్తలు

Published : 25/04/2021 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు.. ఇప్పుడూ ఆమే నా క్రష్‌

పెళ్లి గురించి విశ్వక్‌ ఏమన్నారంటే

హైదరాబాద్‌: ‘వెళ్ళిపోమాకే’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై అతితక్కువ కాలంలో మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు విశ్వక్‌సేన్‌. ప్రస్తుతం ‘పాగల్‌’లో నటిస్తున్న ఆయన ఇటీవల కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం!

మీకిష్టమైన కార్టూన్‌ ?

DEXTER

మీ క్రష్‌ ఎవరు?

అప్పటికీ ఇప్పటికీ ఇలియానానే.

మీకు తెలుగు బాగా వచ్చా?

తెలుగు నా మాతృభాష. నేను నార్త్‌ ఇండియన్‌ అనే అనుమానాన్ని ముందు నువ్వు నీ మైండ్‌ నుంచి తొలగించు.

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ గురించి ఏమైనా మాట్లాడగలరా?

బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా బయటకు వెళ్లి వైరస్‌ని ఎక్కువమందికి వ్యాప్తి చేయకండి.

నేను మీకు వీరాభిమానిని.. మీరు నటిస్తున్న ‘పాగల్‌’ ఎలా ఉండనుందో చెప్పగలరు?

టైటిల్‌కి మించి ఉంటుంది.

మధ్యతరగతి విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?

మనందరం ఒక్కటే అని చెప్తా.

సింగిల్‌ బాయ్స్‌ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?

వాళ్లు అదృష్టవంతులు.

లాక్‌డౌన్‌ సమయంలో మీరు గ్రహించిన కొన్ని విషయాలు చెప్పగలరు?

లాక్‌డౌన్‌ ముందువరకూ తక్కువగా నిద్రపోయి ఎక్కువగా వర్క్‌ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ, లాక్‌డౌన్‌లో నాకు అర్థమైంది ఏమిటంటే ఆరోగ్యం బాగుండాలంటే వర్క్‌ గురించి టెన్షన్‌ పడకూడదు. అలాగే మంచి నిద్ర కూడా ఉండాలి.

మీరు వాడే పర్ఫ్యూమ్‌?

ఏది పడితే అది.

అన్నయ్య నువ్వు ఎప్పుడు భీమవరం వస్తావు?

నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు.

‘పాగల్‌’ ట్రైలర్‌ కోసం ఎదురుచూస్తున్నాం?

మీ అందరికీ ఆ ట్రైలర్‌ని చూపించాలని నాకూ ఆతృతగా ఉంది. కానీ కరోనా...

‘పాగల్‌’ ఎప్పుడు విడుదలవుతుంది?

కరోనానే అడగాలి.

మీ పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు?

సంబంధాలు ఉంటే చెప్పు.

సర్‌.. గతేడాది నుంచి మీరు చాట్‌ చేస్తారేమో అని ఎదురుచూస్తున్నాను. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది.

కానీ, ఇప్పటికీ మీరు నన్ను ఏం అడగలేదు.

అభిమానులకు మీరెంతో విలువ ఇస్తారు. దానికి ధన్యవాదాలు.

నాకు మీరు ఇచ్చే విలువతో దాన్ని సరిపోల్చలేము.

ఆకలేస్తుంది అన్నా.. రెస్టారెంట్‌లో టేబుల్‌ బుక్‌ చేయండి. బయటకు వెళ్లి తినేసి వద్దాం?

ఇంటి అడ్రస్‌ పంపించు.. నీకు పిజ్జా పంపుతా. బయటకంటే మా అమ్మ వాళ్లు తిడుతున్నారు. బయటకు వెళ్తే పబ్లిక్‌ కూడా తిడుతున్నారు. పిజ్జా తింటావా లేక తిట్లు తింటావా..?

బిర్యానీ లేదా ఇడ్లీ ఏది అంటే ఇష్టం?

ప్రస్తుతానికి హలీమ్‌.

మీ నంబర్‌ ఇస్తారా?

తప్పకుండా షర్ట్‌ దా? లేక జీన్స్‌ దా? మీరు నాకేమైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా?

‘కప్పిలై’ రీమేక్‌ చేస్తున్నారా?

లేదు.

హైదరాబాద్‌లో మీకిష్టమైన పబ్‌?

నా టెర్రస్‌.

మీమ్‌ పేజీలపై మీ అభిప్రాయం?

సూపర్‌.

హలీమ్‌లో ఉండే మేజిక్కే వేరు అన్నా. కుదిరితే రేపు నాకో హలీమ్‌ కావాలి.

అడ్రస్‌ మెసేజ్‌ పెట్టు.

మీ చిన్ననాటి ఫొటో ఏదైనా?

పాగల్‌లో మీ లుక్‌ అదిరిపోయింది. మీ లుక్స్‌తో అమ్మాయిల్ని చంపేస్తున్నారు..!

నేను చేయని నేరానికి నన్ను అరెస్ట్‌ చేయించాలని చూడకండి.

‘ఓ మై కాదవులే’ రీమేక్‌ చేస్తున్నావో లేదో క్లారిటీ ఇవ్వు అన్నా?

30 శాతం షూట్‌ పూర్తయ్యింది.

ప్రతినెలా నువ్వు నాకు రూ.10 వేలు పంపించు‌. ఎందుకంటే నువ్వు నా మనస్సులో ఉన్నావు కాబట్టి?

అద్దె బాగా రీజనబుల్‌గా ఉంది.

ఇంట్లో వాళ్లకి తెలియకుండా చేసే పనులేంటి?

ఇంట్లో తెలియకుండా చేసే పనుల్ని ఇప్పుడు బజార్‌లో చెప్పమంటున్నావ్‌ అంతేగా..?

అన్నా నువ్వు రిప్లై ఇవ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటా. నీ మీద ఒట్టు!

ఏం మాట్లాడుతున్నావ్‌ బ్రో..

మీరు ఎక్కడ ఉంటారు?

మీ హృదయంలో..

ఈ ఏడాదిలో బెస్ట్‌ ఫొటో?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని