డాక్టర్‌ వల్ల మరోసారి ట్రెండ్‌లోకి రౌడీ బేబీ
close

తాజా వార్తలు

Published : 23/04/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ వల్ల మరోసారి ట్రెండ్‌లోకి రౌడీ బేబీ

వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రౌడీ బేబీ’.. సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌, లైక్స్‌ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్‌ చేసిన పాటల్లో ఇది కూడా ఒకటి. లిరిక్స్‌కి అనుగుణంగా సాయిపల్లవి, ధనుష్‌ వేసిన స్టెప్పులు ఈ పాటని మరోస్థాయికి తీసుకెళ్లాయి. దీంతో ‘రౌడీ బేబీ’ పాట ఒకానొక సమయంలో ట్రెండ్‌ సెట్‌ చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండేళ్ల తర్వాత ఇప్పుడు అదే పాట మరోసారి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఈసారి ‘రౌడీ బేబీ’ ఒరిజినల్‌ పాట కాకుండా పేరడి నెట్టింట్లో అందర్నీ అలరిస్తోంది.

దేశంలో నానాటికీ హృద్రోగులు సంఖ్య పెరుగుతున్న తరుణంలో భాస్కర్‌ అనే ఓ వైద్యుడు తాజాగా ఓ వీడియోతో గుండె ఆరోగ్యం గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించారు. అందర్నీ ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆయన ‘రౌడీ బేబీ’ పాటను పేరడిగా మలచి పాడారు. మద్యపానం, ధూమపానం చేయకూడదని.. ఉప్పు, కారం, మసాలా ఉన్న వంటలను ఎక్కువగా తినకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ పేరడి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని