Toofaan: ఓటీటీలోనూ విడుదల వాయిదా
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Toofaan: ఓటీటీలోనూ విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫర్హాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘Toofaan’. మృణాల్‌ ఠాకూర్‌ నాయిక. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ దర్శకుడు. ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ‘ప్రస్తుతం మన దేశ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కొవిడ్‌ బారిన పడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆర్‌.ఒ.ఎం.పి. పిక్చర్స్‌ సంస్థలు ఆశిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబాలతో పాటు మరికొంతమందికి సహాయపడటమే మా తక్షణ కర్తవ్యం. ఆ ఉద్దేశంతోనే సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్ణయించాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి.. వ్యాక్సిన్‌ కోసం వివరాలు నమోదు చేసుకోండి’ అని పేర్కొంది.

స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం మే 21 ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో పరేశ్‌ రావల్, ఇషా తల్వార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని