బుల్లితెరపై మెరవనున్న రష్మిక-విజయ్‌ దేవరకొండ
close

తాజా వార్తలు

Published : 21/04/2021 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్లితెరపై మెరవనున్న రష్మిక-విజయ్‌ దేవరకొండ

వైరల్‌గా మారిన క్లిప్‌

హైదరాబాద్‌: వెండితెర స్టార్‌జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ-రష్మిక త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. వీళ్లిద్దరూ స్క్రీన్‌ పంచుకునేది ప్రత్యేక షోల కోసం కాదు. కేవలం ఓ యాడ్‌ కోసం మాత్రమే. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు వాణిజ్య ప్రచారకర్తగా కొనసాగుతున్న ఓ సబ్బుల తయారీ సంస్థకు విజయ్‌-రష్మిక సైతం ఇకపై బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరిపై ఓ సరికొత్త వాణిజ్య ప్రకటన చిత్రీకరించారు. ప్రకటనలో భాగంగా విజయ్‌ మోకాలిపై కూర్చొని రష్మికకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నట్లు ఉన్న ఓ క్లిప్‌ బయటకు వచ్చింది. ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరూ.. ‘ఈపెయిర్‌ మరోసారి ఫిదా చేసేలా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సామ్‌-చై కూడా.. టాలీవుడ్‌లో స్టార్‌ జోడీ, రియల్‌ కపుల్‌ సమంత-నాగచైతన్యలు సైతం ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన కోసం స్క్రీన్‌ పంచుకున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ దబూ రత్నానీ ఫొటోషూట్‌లో పాల్గొన్న సామ్‌-చై సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. దీనికి సంబంధించిన రెండు సరికొత్త ఫొటోలను ఇటీవల సామ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. పూరీ డైరెక్షన్‌లో రానున్న ‘లైగర్‌’లో నటిస్తున్నారు. అలాగే రష్మిక.. ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ కోసం సిద్ధమవుతున్నారు. ‘లవ్‌స్టోరీ’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు నాగచైతన్య చేతిలో ఉన్నాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని