వివేకా హత్య కేసు: సీబీఐ తాత్కాలిక విరామం
close

తాజా వార్తలు

Published : 01/08/2020 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివేకా హత్య కేసు: సీబీఐ తాత్కాలిక విరామం

దిల్లీ వెళ్లిన సీబీఐ అధికారుల బృందం

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రెండు వారాల పాటు ప్రాథమిక విచారణ చేపట్టింది. కడప, పులివెందులలో సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కుమార్తె సునీత, వైకాపా నేత శివశంకర్‌ రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి తదితరులను విచారించారు. ఇంకా పలువురు అనుమానితులను విచారించనున్నారు. తాత్కాలిక విరామం తీసుకుని సీబీఐ బృందం కడప నుంచి దిల్లీ వెళ్లింది. 

తొలుత పదిరోజుల పాటు పులివెందుల వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టి వివేకా ఇంటిలో సీబీఐ అధికారులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సిట్‌ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా కుమార్తె సునీత సమక్షంలో వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లాను అధికారులు విచారించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని