close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహారాష్ట్రలో భాజపాకు గట్టి దెబ్బ

సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే రాజీనామా
రేపు ఎన్‌సీపీలో చేరిక

ముంబయి: మహారాష్ట్రలో భాజపాకు గట్టిదెబ్బతగిలింది. సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే (68) బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు పార్టీతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరనున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ తెలిపారు. మహారాష్ట్రలో భాజపాను బలోపేతం చేయడంలో దివంగత నేతలు ప్రమోద్‌ మహాజన్‌, గోపీనాథ్‌ ముండేలతో పాటు ఖడ్సే అవిశ్రాంతంగా కృషి చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి దేవేంద్ర ఫడణవీస్‌ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖను నిర్వహించారు. మంత్రివర్గంలో నెంబరు-2గా ప్రాముఖ్యం పొందారు.

 ఆయనపై భూకుంభకోణం ఆరోపణలు రావడంతో 2016లో రాజీనామా చేశారు. తనపై ఫడణవీస్‌ కుట్ర పన్నారని, తన జీవితాన్ని నాశనం చేశారని ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఒక మహిళను వేధించినట్టు తనపై తప్పుడు కేసు కూడా పెట్టించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖడ్సేకు టిక్కెట్‌ కూడా లభించలేదు. దాంతో పార్టీ వ్యవహారాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడుతారని అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఖడ్సే పంపిన లేఖ అందిందని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చెప్పారు. ఆయన రాజీనామా పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఆయన రాజీనామా చేస్తారని అనుకోలేదని, ఫడణవీస్‌తో మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు.  ఆయనను నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యే తెలిపారు. దీనిపై నాయకత్వం ఆలోచించాలని  ఆ పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్‌ మునగంటివార్‌ కోరారు. ఖడ్సే రాజీనామా పార్టీ శ్రేణుల్లో దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. భాజపాలోనే కోడలు ఏక్‌నాథ్‌ కోడలు, ఎంపీ రక్షా ఖడ్సే (33) భాజపాలోనే కొనసాగనున్నారు. ఆమె రావేర్‌ స్థానం నుంచి రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

పునాదులు కదులుతున్నాయ్‌: ఉద్దవ్‌ విజయశిఖరాలను అధిరోహించామని చెబుతున్న భాజపా నాయకులు ఇప్పుడు పునాది రాళ్లు ఎందుకు బయటకు వస్తున్నాయో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఖడ్సేకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆయన ముక్కుసూటి నాయకుడని చెప్పారు. 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.