close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో కరోనా విజృంభణ

ఒక్కరోజులో 1,986 కేసులు
ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇదే అత్యధికం
మృతులు 14 మంది
ఈనాడు - హైదరాబాద్‌

 

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నెల 17-20 తేదీల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా.. గత 10 రోజులుగా మాత్రం వరుసగా కేసులు పెరుగుతున్నాయి. 20వ తేదీన 1,198 కేసులు నమోదవగా.. 30న ఏకంగా 1,986 పాజిటివ్‌లను నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది. గురువారం రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచార నివేదికను శుక్రవారం వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో అత్యధికంగా 586 కేసులు నమోదవగా, 20కి పైగా పాజిటివ్‌లు నిర్ధారించిన జిల్లాల జాబితాలో సిద్దిపేట(20), జనగామ(21), రాజన్న సిరిసిల్ల(23), పెద్దపల్లి(26), ములుగు(27), భద్రాద్రి కొత్తగూడెం(29), నాగర్‌కర్నూల్‌(30), వరంగల్‌ గ్రామీణ(30), జోగులాంబ గద్వాల(32), నల్గొండ(36), మహబూబాబాద్‌(37), ఖమ్మం(41), మెదక్‌(45), కామారెడ్డి(46), మహబూబ్‌నగర్‌(61), సంగారెడ్డి(108), కరీంనగర్‌(116), వరంగల్‌ నగర(123) రంగారెడ్డి(205), మేడ్చల్‌ మల్కాజిగిరి(207), జిల్లాలున్నాయి. వీటితో సహా 33 జిల్లాల్లోనూ కొవిడ్‌ కేసులను నిర్ధారించారు. గురువారం మరో 816 మంది కోలుకోగా, ఇప్పటివరకూ 45,388 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. తాజాగా ఇంకో 14 మంది మహమ్మారి సోకి మృత్యువాతపడగా, మొత్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 519కి పెరిగింది. ప్రస్తుతం 16,796 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతుండగా, వీరిలో ఇళ్ల వద్ద, ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 10,632 మంది ఉన్నారు. గురువారం ఒక్కరోజే 21,380 పరీక్షలు చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నిర్వహించిన పరీక్షల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తంగా పరీక్షల సంఖ్య 4,37,582కు పెరిగింది. మరో 1216 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలు కొవిడ్‌ కోసం కేటాయించగా, వీటిల్లో 2,282 పడకల్లో రోగులు సేవలు పొందుతుండగా, మరో 6,164 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోగులు పెద్దసంఖ్యలో చేరుతున్నారు. వీటిల్లో మొత్తం 6,409 పడకలు కరోనా బాధితుల కోసం కేటాయించగా, ఇందులో 3,882 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 2527 పడకలు ఖాళీగా ఉన్నాయి.

జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి
గత వారం రోజుల కేసుల సరళిని పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల నమోదు కొంత తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24న 683 కేసులు నమోదు కాగా, 30న 586 కేసులను నిర్ధారించారు. ఇదే సమయంలో జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్‌, వరంగల్‌ నగర, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని జిల్లాల్లో అయితే రెట్టింపు కంటే అధికంగా నమోదవుతున్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.