హాథ్రస్‌ బాధితుల్ని పరామర్శించిన ఆజాద్‌

తాజా వార్తలు

Published : 04/10/2020 18:54 IST

హాథ్రస్‌ బాధితుల్ని పరామర్శించిన ఆజాద్‌

లఖ్‌నవూ: భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదివారం హాథ్రస్‌ బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. భారీ ఎత్తున భీమ్‌ ఆర్మీ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన బాధితుల స్వగ్రామం బూల్‌గదికి చేరుకున్నారు. హాథ్రస్‌ అత్యాచార ఘటనపై బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘బాధిత కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పించాలి. లేదంటే వారిని నా ఇంటికి తీసుకెళ్తాను. వారికి ఇక్కడ భద్రత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే ఈ కేసు దర్యాప్తు జరిపించాలి’ అని డిమాండు చేశారు. 

హాథ్రస్‌ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు హాథ్రస్‌ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ కేసును సీబీఐకి దర్యాప్తు అప్పగిస్తూ ఆదేశాలు చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని