​అమిత్‌షాకు నెగిటివ్‌పై హోంశాఖ క్లారిటీ

తాజా వార్తలు

Updated : 09/08/2020 17:03 IST

​అమిత్‌షాకు నెగిటివ్‌పై హోంశాఖ క్లారిటీ

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వార్తను హోంశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయనకు ఎలాంటి కరోనా పరీక్షలూ నిర్వహించలేదని ఆ శాఖకు చెందిన అధికారి తెలిపారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినట్లయితే తామే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దని సూచించారు.

ఈ నెల 2న అమిత్‌ షా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు గురుగ్రాంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చిందంటూ ఆ పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. హోంశాఖ అధికారుల వివరణతో ఆయన తన ట్వీట్‌ను డిలీట్‌ చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని