మా వివాహం అప్పుడే: న్యూజిలాండ్‌ ప్రధాని

తాజా వార్తలు

Published : 12/11/2020 01:29 IST

మా వివాహం అప్పుడే: న్యూజిలాండ్‌ ప్రధాని

వెల్లింగ్టన్‌: మా వివాహానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకున్నాకే పెళ్లి చేసుకుంటామని  న్యూజిలాండ్‌కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. తమ వివాహానికి మరికొంత సమయం పట్టొచ్చన్నారు. న్యూ ప్లైమౌత్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో విలేకరి అడిగిన ప్రశ్నకు జెసిండా సమాధానమిచ్చారు. ‘మాకు కొన్ని ప్లాన్స్‌ ఉన్నాయి. వాటిని కుటుంబసభ్యులు, మిత్రులతో పంచుకోవాలి. అవి నెరవేరేందుకు మరికొంత సమయం పట్టొచ్చు’ అని వెల్లడించారు. 

జెసిండా ఆర్డెర్న్‌ (40)కు, టీవీ వ్యాఖ్యాత క్లార్క్‌ గేఫోర్డ్‌ (44)కు గతంలోనే నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం ఆ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. న్యూజిలాండ్‌లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెసిండా అధ్యక్షత వహిస్తున్న లేబర్‌ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది. దీంతో జెసిండా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. పార్టీ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా మెజారిటీ సాధించి మొట్టమొదటిసారి మరే ఇతర పార్టీతో పొత్తు కలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని