కనీస మద్దతు ధర కొనసాగుతుంది: రాజ్‌నాథ్‌

తాజా వార్తలు

Updated : 27/12/2020 17:45 IST

కనీస మద్దతు ధర కొనసాగుతుంది: రాజ్‌నాథ్‌

దిల్లీ: ప్రభుత్వం రైతుల పంటలకు ప్రభుత్వం తప్పకుండా కనీస మద్దతు ధర కల్పిస్తుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భరోసా ఇచ్చారు. అదేవిధంగా మండీ వ్యవస్థ సైతం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జైరాంఠాకూర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన వర్చువల్‌ సమావేశంలో మాట్లాడారు. ‘రైతుల పంటలకు కనీస మద్దతు ధర తప్పకుండా ఉంటుంది. రైతుల భూముల్ని ఎవరూ తీసుకోలేరు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తులు అమాయక రైతుల్ని తప్పుదోవ పట్టించడం ఎంతో దురదృష్టకరం. భవిష్యత్తులో మండీ వ్యవస్థ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంఎస్‌పీ సహా మండీ వ్యవస్థలు కొనసాగుతాయి’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. 

హిమాచల్‌ప్రదేశ్‌లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి కేవలం రూ.22వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చింది’ అని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. 

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నెల రోజుల నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్రంతో రైతులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ.. రైతుల డిమాండ్లపై కేంద్రం ఏకీభవించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని రైతులు చెబుతున్నారు. కాగా డిసెంబర్‌ 29న మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు అంగీకరించాయి. 

ఇదీ చదవండి

wwe స్టార్‌ ల్యూక్‌ హార్పర్‌ మృతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని