చైనాలో కళాకారులకు నైతిక మార్గదర్శకాలు!

తాజా వార్తలు

Published : 09/02/2021 01:55 IST

చైనాలో కళాకారులకు నైతిక మార్గదర్శకాలు!

బీజింగ్‌: చైనాకు చెందిన నటీనటులు, కళాకారులు సమాజంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ‘‘కళాకారులు నైతిక విలువలు, ప్రజల ఆచారాలను ఉల్లంఘించకూడదు. ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ప్రవర్తించకూడదు. దేశంలోని జాతుల మధ్య ద్వేషాన్ని లేదా వివక్షను ప్రేరేపించకూడదు. మూఢనమ్మకాలను, అతీంద్రశక్తుల వంటి అంశాలను ప్రోత్సహించరాదు’’ అని చైనీస్‌ అసోసియేషన్‌ ఫర్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటిని మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి తెస్తామని తెలిపింది. ఎవరైనా ఈ మార్గదర్శకాలు పాటించకపోతే వారిని ప్రజల ముందు ప్రదర్శన ఇవ్వడాన్ని నిషేధిస్తామని స్పష్టం చేసింది. ఆకస్మికంగా ఈ మార్గదర్శకాలు జారీ చేయడానికి గల కారణాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. దీంతో ఈ మార్గదర్శకాలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని