Kerala: సినిమాహాళ్లు, కళాశాలకు పచ్చజెండా.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

తాజా వార్తలు

Published : 02/10/2021 23:25 IST

Kerala: సినిమాహాళ్లు, కళాశాలకు పచ్చజెండా.. కేవలం వారికి మాత్రమే అనుమతి!

తిరువనంతపురం: కరోనా కారణంగా నెలలపాటు మూసివేసిన సినిమా హాళ్లు, ఆడిటోరియాలను తెరవనున్నట్లు కేరళ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేవలం 50 శాతం సామర్థ్యంతో ఈనెల 25వ తేదీ నుంచి వీటిని తెరువనున్నట్లు పేర్కొంది. అయితే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికే వీటిలోకి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాలలు తెరిచేందుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేసుకున్న విద్యార్థులు మాత్రమే కాలేజీలకు వెళ్లాలని పేర్కొంది.

కేరళ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనలు ఇవే..

* కేవలం 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సినిమా హాళ్లు, ఇండోర్ ఆడిటోరియాలు తెరిచేందుకు అనుమతి.

 వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారికే అనుమతి. సిబ్బంది మొత్తం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకొని ఉండాలి.

* అక్టోబర్‌ 18 నుంచి కళాశాలలు తెరుచుకోవచ్చు. అధ్యాపకులు, సిబ్బందితోపాటు విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకొని ఉండాలి. బయోబబుల్‌లో హాస్టళ్లు నిర్వహించుకోవచ్చు. 

* వివాహ శుభకార్యాలతోపాటు అంత్యక్రియలకు 50 మందికి మించి హాజరు కాకూడదు.

* నవంబర్‌ 1 నుంచి గ్రామ సభలు నిర్వహించుకోవచ్చు. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే హాజరు కావాలి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుప్పటికీ.. కేరళలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కేసులు వందలకే పరిమితం కాగా కేరళలో మాత్రం ఇటీవల 20-30 వేల కేసులు వెలుగుచూశాయి. దేశంలో నమోదవుతున్న సగానికి పైగా కేసులు ఈ రాష్ట్రం నుంచే ఉండేవి. విస్తృత వ్యాక్సినేషన్, టెస్టులు, నిబంధనల కారణంగా కొద్దిరోజలుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పలు నిబంధనలను సడలించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని