Russia: రష్యాలో ఒక్కరోజే 936 కొవిడ్‌ మరణాలు

తాజా వార్తలు

Published : 08/10/2021 23:28 IST

Russia: రష్యాలో ఒక్కరోజే 936 కొవిడ్‌ మరణాలు

మాస్కో: ప్రపంచ దేశాలు కరోనా థర్డ్‌ వేవ్‌ గురించే వణికిపోతున్నాయి. ఒకవేళ మహమ్మారి మళ్లీ విజృంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చలు సాగిస్తున్నాయి. అలాగే వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని ఆ దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో మాత్రం కరోనా తారస్థాయికి చేరుకుంటోంది. తాజాగా రష్యాలో వైరస్‌ విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 936 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆ దేశంలో పెద్ద సంఖ్యలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. అక్కడ రోజువారీ మరణాలు 900కు చేరుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

యూరప్‌ దేశాల్లో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో రష్యా మొదటిస్థానంలో ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం రష్యాలో 2,14,000 మంది కరోనాతో మరణించారు. కానీ, రికార్డుల్లో లేని మరణాలు కూడా చాలా వరకు ఉండి ఉంటాయని అంచనా. శుక్రవారం ఒక్కరోజే 27,246 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, గురువారంతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. గురువారం రోజున 27,550 కేసులు నమోదయ్యాయని అక్కడి కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. 

రెండు డోసుల టీకా 29 శాతం మందికే పూర్తి..

గత సెప్టెంబరులోనే కొవిడ్‌ ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరిగి మరణాలు చోటుచేసుకున్నాయి. దీనికి నెమ్మదించిన వ్యాక్సినేషన్‌ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, గురువారం నాటికి రష్యా జనాభా (146 మిలియన్ల)లో 33 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా పూర్తయింది. ఇందులో రెండు డోసులు తీసుకున్నవారు 29 శాతం మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్‌ రేటు తగ్గడం, ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యం కారణంగానే దేశంలో ఈ పరిస్థితి ఎదురైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, రష్యాలో ఇప్పటివరకూ 77 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడగా.. 2,14,485 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని